Airtel Network : ఎయిర్టెల్ కు షాక్ ఇచ్చిన హ్యాకర్లు

243

హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. హ్యాకింగ్ కి కాదెమీ అనర్హం అనే రేంజ్ లో డేటా చోరీకి పాల్పడుతున్నారు. రక్షణ రంగానికి సంబందించిన కీలక విషయాలను తస్కరించడం మొదలుకొని ప్రభుత్వం వెబ్ సైట్ లలో ఉండే డేటాను కూడా కాజేస్తున్నారు. ఇక తాజాగా ప్రముఖ టెలికామ్ దిగ్గజం ఎయిర్టెల్ కు హ్యాకర్లు భారీ షాక్ ఇచ్చారు. దాదాపు 25 లక్షలమంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను హ్యాక్ చేశారు. అక్కడితో ఆగకుండా తస్కరించిన డేటాను అమ్మకానికి ఉంచారు.

దింతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఎయిర్టెల్‌ సిమ్‌ కార్డులను వాడుతున్న వారి చిరునామా, నగరం, ఆధార్ కార్డ్ నంబర్, లింగ వివరాలు వంటి వ్యక్తిగత వివరాలతో పాటు టెలిఫోన్ నంబర్లను కొందరు హ్యాకర్లు ఎయిర్‌టెల్ సెర్వర్ నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా దొంగలించారు. అనంతరం ఎయిర్టెల్ భద్రతా బృందాలను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. 3500 డాలర్ల విలువైన బిట్ కాయిన్లను వసూలు చేయడానికి ప్రయత్నించారు.

అయితే డీల్ కుదరకపోవడంతో తస్కరించిన డేటాను అమ్మకానికి పెట్టారు. అమ్మెందుకు ఓ వెబ్ సైట్ తయారు చేశారు. దొంగలించిన డేటాలో ఎక్కువ శాతం జమ్మూ&కాశ్మీర్ ప్రాంతంలోని చందాదారులవి అని తెలుస్తుంది. అయితే ఎయిర్టెల్ మాత్రం హ్యాకింగ్ విషయాన్నీ కొట్టిపారేస్తుంది. తమ వినియోగదారుల ప్రైవసీని కాపాడటానికి అనేక రకాల చర్యలను తీసుకుంటుందని తమ వద్ద నుంచి ఎలాంటి డేటా బయటకి లీక్ కాలేదని” ఎయిర్టెల్ తెలిపింది.

ఎయిర్టెల్ కు షాక్ ఇచ్చిన హ్యాకర్లు