ముగిసిన అగ్రిగోల్డ్ కేసు విచారణ

1381

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులో ఈడీ విచారణ ముగిసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను ఈడీ విచారించింది. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాస్ వెంకట్ రామారావు, అవ్వాస్ వెంకట శేషు నారాయణ, హేమ సుందర వరప్రసాద్ లను 10 పదిరోజులపాటు కస్టడీలోకి తీసుకోని విడివిడిగా విచారించారు ఈడీ అధికారులు. విదేశాల్లో పెట్టిన పెట్టుబడులపై కూపీ లాగారు. దేశంలోని ఆస్తుల వివరాలను తెలుసుకున్నారు.

మొత్తం రూ. 4109 కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. కాగా అగ్రిగోల్డ్ కంపెనీ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి దారుణంగా మోసం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారికి గత టీడీపీ ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. పదివేలకు తక్కువగా ఉన్న డిపాజిట్లకు డబ్బు చెల్లింది ప్రభుత్వం

 

ముగిసిన అగ్రిగోల్డ్ కేసు విచారణ