గుండెపోటులో ఆ గంటే కీలకం..

248

గుండె పోటు(హార్ట్ఎటాక్‌)లో మొదటి గంటే కీలకమని డాక్టర్ జైనులాబేదిన్ హందులే చెప్పారు. హార్ట్ ఎటాక్ అంటే, గుండెకు రక్త నాళాల ద్వారా జరిగే రక్త సరఫరాలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు గుండె నొప్పి వస్తుంది. దీంతో ఆక్సీజన్‌తో కూడిన రక్తం గుండెకు చేరుకోకపోవడంతో హార్ట్ ఎటాక్ వస్తుంది. డాక్టర్ హందులే ముఖ్య సూచనలు..

మెజారిటీ గుండెపోటు కేసులలో కొన్ని గంటల తర్వాతనే పేషెంట్‌ను ఆసుపత్రికి తీసుకొస్తున్నారని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని తెలిపారు. గుండెపాటు వచ్చిన మొదటి గంట తర్వాతనే శరీరానికి రక్త ప్రసరణ ఆగిపోతుందని, అందుకు గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్‌ అవర్‌ అంటారని డాక్టర్‌ పేర్కొన్నారు.