విమానంలో టాయిలెట్స్ వాడొద్దు. డైపర్ వేసుకోండి.

93

కరోనా మహమ్మారి అన్ని రంగాలను కుదేలు చేసింది.. ఇంకా చేస్తూనే ఉంది. ప్రధానంగా ఈ మహమ్మారి కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఇక ప్రపంచ దేశాల్లో కరోనా కారణంగా స్తంభించిన ప్రజా రవాణా మెల్లిమెల్లిగా అందుబాటులోకి వస్తుంది. రైళ్లు, విమాన సర్వీసులు కరోనా నిబంధనలతో ప్రారంభమయ్యాయి. ఈ మహమ్మారి జన్మస్థానం చైనాలో కూడా ఇప్పుడిప్పుడే ప్రజా రవాణా అందుబాటులోకి వస్తుంది.

ఇక ఈ నేపథ్యంలోనే విమానాల్లో ప్రయాణించే సిబ్బందికి పలు సూచనలు చేసింది చైనా విమానయానశాఖ. సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది. ప్రధానంగా విమాన సిబ్బంది వాష్ రూంలు వినియోగించవద్దని, దీనికి బదులుగా డైపర్లు వినియోగించాలని తెలిపింది. 500కు పైగా వైరస్‌ కేసులు నమోదైన దేశాలకు వెళ్లే విమానాల్లోని సిబ్బంది ఈ ఆదేశాలు తప్పకుండా పాటించాలని పేర్కొంది.

అలాగే మాస్క్ లు, గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి అని, కళ్లద్దాలు పెట్టుకోవాలని సూచించింది. పీపీఈ కిట్లు ధరించాలని, బూట్లకు కవర్లు తొడగాలని ఆ ఉత్వర్వుల్లో వివరించింది. టోపీలు, షూ కవర్లు కూడా ధరించాలని సూచించింది. నిబంధలు విస్మరిస్తే శిక్షార్హులవుతారని తెలిపింది.

విమానంలో టాయిలెట్స్ వాడొద్దు. డైపర్ వేసుకోండి.