సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదిత్యనాథ్‌ దాస్

47

ఇటీవల ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్‌ దాస్.. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్బంగా తనను సీఎస్ గా ఎంపిక చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారాయన.. ఆ సమయంలో డీజీపీ గౌతం సవాంగ్ కూడా అక్కడే ఉన్నారు.

కాగా ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు.. అదే రోజు నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. బీహార్ కు చెందిన ఆదిత్యనాథ్‌ దాస్ గతంలో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు ఆయన సన్నిహితంగా వ్యవహరించేవారన్న పేరుంది.