సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాథ్ దాస్

83

ఆంధ్ర ప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్, సచివాలయంలోని మొదటి బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించారు. నీలం సాహ్ని పదవీ కాలం ముగియడంతో ఆమె తన బాధ్యతలను కొత్త సీఎస్ కు బాధ్యతలు అప్పగించారు. వేదపండితుల ఆశీర్వాదాలు మధ్య బాధ్యతలు స్వీకరించి తొలిసంతకం చేశారు ఆదిత్యనాథ్ దాస్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అన్ని శాఖల్లోని అధికారులను సమన్వాయపరుచుకొని ముందుకు వెళ్తానని తెలిపారు.

సీఎం జగన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతాం అన్నారు. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిసారించిందని, ముక్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉందని.,ఆ దిశగానే పూర్తి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ప్రతి సమస్యకు పరిష్కారం కనుక్కునే విధంగా అధికారులు అందరూ పని చేస్తారని చెప్పారు.

సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాథ్ దాస్