మరోసారి ప్రేమలో పడ్డ వనితా విజయ్ కుమార్

100

వనితా విజయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురితో ఇమడలేకపోయారు. ఇక తాజాగా మరో వ్యక్తితో ప్రేమలో పడినట్టు తెలుస్తుంది.. ఈ విషయాన్నీ స్వయానా వనితా తన ఇన్ స్టా ద్వారా తెలిపారు. ఉమా రియాజ్ ఖాన్ కు ట్యాగ్ చేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు విజయ. కాగా ఈమె ఇప్పటికి ఐదుసార్లు ప్రేమలో పడింది. ఇక ఈ ఏడాది జూన్ లో సినీ పరిశ్రమకు చెందిన పీటర్, వనితా పెళ్లి చేసుకున్నారు. మూడు నెలలకే వనితను వదిలేసి వెళ్ళాడు పీటర్.. ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటుంది. దింతో వేరొకరితో ప్రేమలో పడినట్లు తెలుస్తుంది..

కాగా ప్రముఖ సినీ దంపతులు విజయ్‌కుమార్, మంజుల పెద్ద కుమార్తె వనితా విజయ్‌కుమార్. చంద్రలేఖ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో చేశారు. టీవీ సీరియల్స్ లో నటించారు. ఇక ఈమె మొదటి పెళ్లి 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్ తో జరిగింది. వీరిద్దరూ 2007 వరకు కలిసి ఉన్నారు. వీరికి ముగ్గురు సంతానం..తర్వాత వీరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు. 2008లో వ్యాపారవేత్త జయ్ రాజన్‌ను వనితా రెండో పెళ్లి చేసుకున్నారు. 2012 లో విడిపోయారు.

2012 నుంచి 2016 వరకు ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్ రాబర్ట్‌తో రిలేషన్‌లో ఉన్నారు వనితా, ఆ తర్వాత ఇద్దరి మధ్య బేధం రావడంతో విడిపోయారు. ఇక 2016 నుంచి ఒంటరిగా ఉన్న వనితా 2020 పీటర్ ను పెళ్లిచేసుకున్నారు. వారి వివాహం మూడు నెలల ముచ్చటగా జరిగిపోయింది. ప్రస్తుతం పీటర్ తన మొదటి భార్య ఎలిజిబెత్ దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒంటరిగా ఉంటున్న వనితా లవ్ లోపడినట్లు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

మరోసారి ప్రేమలో పడ్డ వనితా విజయ్ కుమార్