పేలిన పెట్రోల్ బాంబ్.. సినీ నటుడికి గాయాలు

328

షూటింగ్ లో ప్రమాదాలు జరగడం సర్వ సాధారణం. ఈ ప్రమాదాల్లో మరణించిన వారు కూడా ఉన్నారు. గతేడాది భారతీయుడు సినిమా షూటింగ్ లో క్రేన్ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కన్నడ మూవీ చిత్రీకరణలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నటుడు రిషబ్ శెట్టికి గాయాలయ్యాయి. కర్ణాటకలోని హాసన్ జిల్లా బేలూరులో పోరాట దృశ్యాలు చిత్రీకరణ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

స్క్రిప్ట్ ప్రకారం నటుడు రిషబ్ పెట్రోల్ బాంబు విసిరాడు.. బాంబ్ విసిరినఅనంతరం రిషబ్ తోపాటు తన పక్కనే ఉన్న మరోనటుడు లక్ష్మణ పరారు కావాల్సి ఉంటుంది. అయితే బాంబ్ ఒక్కసారిగా పేలి మంటలు పెద్దగా రావడంతో రిషబ్ కు అంటుకున్నాయి. దింతో అతడికి కాలిన గాయాలు అయినట్లు సమాచారం. రిషబ్ కోలుకుంటున్నట్లు కన్నడ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

పేలిన పెట్రోల్ బాంబ్.. సినీ నటుడికి గాయాలు