బాలీవుడ్ నటుడు రాజీవ్ కపూర్ ఇకలేరు

256

బాలీవుడ్ నటులు రిషి కపూర్, రణధీర్ కపూర్ ల తమ్ముడు.. నటుడు రాజీవ్ కపూర్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 58 సంవత్సరాలు.. ఆయనకు భారీ గుండెపోటుతో రావడంతో ఇన్లాక్స్ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. తన బావ మరణంపట్ల నీతు కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సంతాపం తెలిపారు. అందులో రాజీవ్ కపూర్ చిత్రాన్ని ఒకటి పంచుకుంటూ RIP అని రాశారు. రాజీవ్ కపూర్ ప్రముఖ చిత్రాలలో రామ్ తేరి గంగా మెయిలీ, మేరా సాతి , హమ్ టు చాలే పార్డెస్ సహా అనేక హిట్ చిత్రాలలో నటించారు. అంతేకాకుండా రిషి కపూర్ నటించిన ప్రేమ్ గ్రంథ్ , ఆ అబ్ లాట్ చాలెన్ లకు దర్శకత్వం వహించారు.