ఎమ్మెల్యే రోజా ఇంట సందడి చేసిన అర్జున్‌ కుటుంబం

75

ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజాను సినీ నటుడు అర్జున్‌ కుటుంబ సమేతంగా కలిశారు.. చిత్తూరు జిల్లా నగరిలోని ఆమె నివాసంలో ఈ భేటీ జరిగింది. అర్జున్‌ వెంట ఆయన భార్య నటి నివేదిత, కుమార్తెలు నటి ఐశ్వర్య, అంజనా ఉన్నారు. అర్జున్‌ గురువారం సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ నగరిలో రోజాను, ఆమె భర్త సెల్వమణిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లారు. కాసేపు సరదాగా మాట్లాడారు.

తిరుమలకు వెళుతూ స్నేహితురాలిని కలవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అర్జున్‌ తెలిపారు. కాగా తమ ఇంటికి వచ్చిన అర్జున్‌ కుటుంబ సబ్యులకు మంచి విందుభోజనం ఏర్పాటు చేశారు రోజా.. అనంతరం నివేదితకు చీర బహుకరించారు రోజా. అర్జున్ నగరి వచ్చారని తెలుసుకున్న స్థానికులు పెద్దఎత్తున రోజా ఇంటివద్దకు చేరుకున్నారు.