చిరుకు నీరసం, నిలిచిపోయిన షూటింగ్.

15323

ఆచార్య మూవీ షూటింగు సమయంలో చిరంజీవి అనారోగ్యానికి గురయ్యారు. నీరసంగా ఉండటంతో సినిమా షూటింగ్ నిలిపివేశారు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం బొగ్గు గనుల్లో ఆచార్య సినిమా చిత్రీకరణ జరుగుతుంది. వేసవి కాలం కావడంతో ఎండల తీవ్రత అధికంగా ఉంది. సాధారణంగా పని చేసేవారే ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడు ఏసీ రూములలో ఉండే సెలెబ్రెటీలు ఈ ఎండలను తట్టుకోవడం కొంచం కష్టంగానే ఉంటుంది. బొగ్గు గనులు కావడంతో మరింత వేడి ఉంటుంది. బాడీ డిహైడెట్ అవుతుంది. ఇక ఇటువంటి ప్రాంతాల్లో షూటింగ్ చెయ్యాలి అంటే నటీనటులకు కొంత రిస్క్ తో కూడుకున్న పనే.. షూటింగ్ సమయంలో నీడకు వెళ్లి సేదతీరే అవకాశం ఉండదు.

షూటింగ్ జరుగుతున్నంత సేపు లొకేషన్ లో ఉండాల్సిందే.. ఇలా ఎక్కువ సేపు లొకేషన్ లో ఉంటే ఎవరైనా నీరసానికి గురవవుతారు. చిరంజీవి విషయంలో కూడా ఇదే జరిగింది. బాడీ డిహైడెట్ అవడంతో చిరుకు నీరసం వచ్చింది. కొద్దీ సేపటి తర్వాత షూటింగ్ కంటిన్యూ చెయ్యాలని చిత్రబృందాని చిరు కోరినట్లు తెలుస్తుంది. అయితే వారు ఫేస్ లో కొంచం తేడా ఉన్న సినిమా మొత్తంపై ఎఫెక్ట్ పడుతుందని భావించిన చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుంది. షూటింగ్ నిలిపివేసి ప్యాక్ చేసుకొని హైదరాబాద్ కు వచ్చేశారు చిత్రబృందం.

చిరుకు నీరసం, నిలిచిపోయిన షూటింగ్.