సంపూర్ణేష్ బాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

247

హృదయం కాలేయం ఫేమ్ సంపూర్ణేష్ బాబు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సంపూర్ణేష్ బాబు హీరోగా బజారు రౌడీ సినిమా తెరకెక్కుతుంది. చిత్రంలోని ఫైట్స్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ లో హీరో సంపూ బైక్ తోపాటు గాల్లో లేవాల్సి ఉంటుంది. అందుకోసం బైక్ ను తాడుతో కట్టారు. బైక్ ను కిందకు వదిలే సమయంలో బ్యాలెన్స్ అవుట్ అయి సంపూ కొండపడిపోయాడు. అయితే ప్రమాదంలో అతడికి ఎటువంటి గాయాలు కాలేదని చిత్ర బృందం తెలిపింది. ఎత్తుతక్కువ ఉండటంతో సంపూ క్షేమంగా బయటపడ్డారు. ఆ దృశ్యమంతా మానిటర్‌లో కనిపించింది.

అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడినట్టు సమాచారం. ఈ చిత్రానికి వసంత నాగేశ్వరావు దర్శకత్వం వహిస్తుండగా సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. మహేశ్వరి వద్ది కథానాయికగా ఆడిపాడుతోంది. సాయి కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లో నటించనున్నారు సంపూ.. ప్రమాదంలో తనకు గాయాలేం కాలేదని ఎవరు భయపడవద్దని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు సంపూర్ణేష్ బాబు.

సంపూర్ణేష్ బాబుకు తృటిలో తప్పిన ప్రమాదం