బిగ్‌బాస్‌లో చూపించలేదు.. అసలు నిజం చెప్పిన అభిజీత్.. హారిక నా చెల్లి లాంటిదే!

115

బిగ్ బాస్ 4వ సీజన్ మొత్తం చూసుకుంటే.. కథ మొత్తం ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో హైప్ క్రియేట్ అయ్యి.. హారిక, అభిజిత్ ప్రేమ కథ చట్టూనే నడిచింది. మోనాల్ చుట్టూనే కథ నడిచింది. మోనాల్, అభిజీత్, హరిక లేకుంటే.. వారి ప్రేమ కథ నడవకుంటే అసలు బిగ్ బాస్ సీజన్ ఇంట్రస్టింగ్ సబ్జెక్టే కాదు అన్నట్లుగా సాగింది. ఏదైదే ఏంటీ షో మొత్తం ముగిసింది. టైటిల్ విన్నర్‌గా అభిజీత్ నిలిచాడు. బిగ్‌బాస్ 4వ సీజన్ ముగిసి రెండ్రోజులు అయ్యింది.

అయినా కూడా ఇంకా బిగ్‌బాస్ గురించి ఇంట్రస్టింగ్ కథనాలు, విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. బిగ్‌బాస్ షో ఫైనల్ ఎపిసోడ్‌లో హారిక ఎలిమినేట్ అయ్యాక.. బై బ్రదర్స్ అంటూ అందరినీ ఉద్ధేశించి అనేసింది. అప్పుడే అందరికీ అభిజీత్, హారిక మధ్య లవ్ లేదు అనే విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. లేటెస్ట్‌గా ఇదే విషయమై అభిజీత్ నోరు విప్పాడు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. అభి-హరికల మధ్య ఏదో నడుస్తుంది అన్నట్టుగా క్రియేట్ చేశారే తప్ప అందులో నిజం లేదని స్పష్టం చేశారు. బిగ్‌బాస్ హౌస్‌లోనే అనేకసార్లు ఇదే విషయమై హారికతో మాట్లాడుతూ ‘నా చెల్లివి నువ్వు’ అని అన్నానని అభి చెప్పారు.

ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా ఎడిటింగ్‌లో బిగ్‌బాస్ నిర్వాహకులు జాగ్రత్తపడ్డారని అభి చెప్పుకొచ్చాడు. వీరిద్దరి పెళ్లికి సంబంధించి రకరకాల తంబునైల్స్‌తో ఎన్నో వీడియోలు.. తల్లిదండ్రుల అభిప్రాయాలు నెట్టింట్లో తెగ షికారు చేశాయి. వాటిపై మాట్లాడుతూ.. తనకు ఒక తమ్ముడు ఉన్నాడని, ఇక హారిక లాంటి చెల్లెలు కూడా ఉంటే బాగుంటుందని అనుకునేవాడినని, అందుకే ఆమెతో ఎక్కు టైమ్ గడిపినట్లు అభిజీత్ చెప్పుకొచ్చాడు. అయితే అభిజిత్ కామెంట్స్‌పై ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు తెగ ఫైర్ అవుతున్నారు. చెల్లితో ఎవరైనా ఆలా బిహేవ్ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా అభి చెబుతున్న విషయాలను బట్టి చూస్తే.. బిగ్‌బాస్‌లో ఏది జరిగినా కూడా.. బయటకు మాత్రం వారు అనుకున్నట్లుగా చూపిస్తున్నారు అనే విషయం స్పష్టం అవుతుంది.