సిరిసిల్ల జిల్లాలో దారుణం

61

సిరిసిల్ల జిల్లాలో వరుస కలకలం సృష్టిస్తున్నాయి. గడిచిన 15 రోజుల్లో ముగ్గురిపై అత్యాచారం జరిగింది. ఇదిలా ఉంటే ఎల్లారెడ్డిపేటలో మైనర్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేస్తుండగా వీడియోలు తీసి ఎవరికైనా చెబితే సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దింతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. వైద్యపరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. కాగా అత్యాచారానికి పాల్పడిన యువకులు గంజాయి సేవిస్తారని స్థానికులు చెబుతున్నారు.

సిరిసిల్ల జిల్లాలో దారుణం