ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు శిక్ష

266

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కు చెందిన భద్రతా సిబ్బందిపై దాడి చేయడంతో 2016 లో నమోదైన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే, న్యాయవాది సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ కోర్టు.. ఈ మేరకు శనివారం సోమనాథ్ భారతికి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ శిక్ష విధిస్తు.. లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు.

అయితే, ఈ కేసులో జైలు శిక్షకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ కు వెళ్ళడానికి భారతికి అవకాశం కూడా ఇచ్చారు. కాగా సెప్టెంబర్ 9, 2016 న, సోమనాధ భారతి తోపాటూ దాదాపు 300 మంది అనుచరులతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వద్ద హల్చల్ చేశారు.. ఈ క్రమంలో సరిహద్దు గోడ కంచెను జెసిబి సహాయంతో కూల్చారు.. అడ్డొచ్చిన భద్రతా సిబ్బందిపై దాడి చేశారన్న ఆరోపణలతో కేసు నమోదు అయింది.