అసెంబ్లీ ఎన్నికలపై అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం

110

త్వరలో ఆరు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ తొమ్మిదవ జాతీయ మండలి సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

ఇతర పార్టీలకు భవిశ్యత్ గురించి ఆలోచన లేదని, అందుకే ఆయా పార్టీలు గతం గురించి మాట్లాడుతున్నాయని.. ఆప్ మాత్రమే భవిష్యత్తు గురించి మాట్లాడుతోందిని అన్నారు. వచ్చే రెండేళ్లలో యూపీ, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల తోపాటు దేశవ్యాప్తంగా పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయాలని కేజ్రీవాల్ ఆప్ సభ్యులను కోరారు. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన పరిణామాలపై అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. హింస‌కు పాల్ప‌డిన రైతుల‌ను అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు.