ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : కేజ్రీవాల్

69

ఉత్తరప్రదేశ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం చెప్పారు. ఢిల్లీ మాదిరిగానే తమ రాష్ట్రంలో పాలనను, సౌకర్యాలను అందించాలని ఉత్తరప్రదేశ్ వాసులు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. వైద్య అవసరాలు, విద్య, తదితర సౌకర్యాల కోసం ఉత్తర ప్రదేశ్‌లోని జిల్లాల ప్రజలు ఢిల్లీకి ఎందుకు రావాలి? వారు తమ సొంత రాష్ట్రంలోనే ఈ సౌకర్యాలన్నీ పొందాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.