Hyderabad news : గన్ తో హల్చల్ చేసిన యువకుడు

453

ఉన్మాదానికి పాల్పడుతున్న ప్రేమికుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. గడిచిన మూడు నాలుగు నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమోన్మాదుల చేతులో పదిమందికిపైగా అమ్మాయిలు ప్రాణాలు విడిచారు. మరికొందరు గాయపడ్డారు. ఇంకొందరు ప్రతిరోజూ వేధింపులు ఎదురుకుంటున్నారు. కాగా శుక్రవారం హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ ఘటన ఉలిక్కిపడేలా చేసింది. అభిషేక్ అనే యువకుడు, ఎయిర్ గన్ తో హల్చల్ చేశాడు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డుమ్మాయిగూడ పద్మశాలి టౌన్ షీప్ లో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన యువతి గీతాంజలి కళాశాలలో బీటెక్‌ చదువుతూ దమ్మాయిగూడ లేక్‌వ్యూ కాలనీలోని బంధువుల ఇంట్లో నివాసముంటోంది. దమ్మాయిగూడ సాయిబాబానగర్‌కు చెందిన అభిషేక్‌(20) అదే కళాశాలలో చదువుతూ యువతిని ప్రేమిస్తున్నానంటూ కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. అనేకసార్లు యువతిని అడ్డగించి తనను ప్రేమించాలని వేధింపులకు గురిచేశాడు. అతడి వేధింపులు తట్టుకోలేక యువతి తన సోదరుడు భానుప్రకాశ్‌ కు తెలిపింది.

దింతో అతడు రెండు మూడు సార్లు అభిషేక్ కు వార్ణింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే భాను ప్రకాష్ ను పద్మశాలి టౌన్‌షిప్‌కు పిలిపించి ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఎయిర్‌గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. దింతో స్థానికులు అభిషేక్ కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. అతడితోపాటు అతడి స్నేహితులకు కూడా దేహశుద్ది చేశారు. పోలీసులు అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడు ఉపయోగించిన ఎయిర్‌గన్‌ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన బొమ్మతుపాకీ అని పోలీసులు నిర్ధారించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad news : గన్ తో హల్చల్ చేసిన యువకుడు