ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన లడఖ్ శకటం

116

72వ గణతంత్ర వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఢిల్లీలో శకటాల ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో లడఖ్ శకటం ముందు వెళ్లగా మిగతావి దానిని అనుసరించాయి. ఈ శకటంపై ల‌ఢ‌ఖ్‌లోని ల‌లిత క‌ళ‌లు వాస్తుక‌ళ‌, భాష‌లు యాస‌లు, అచార వ్య‌వ‌హారాలు, ఉత్స‌వాలు పండుగ‌లు, సాహిత్యం, సంగీతంతోపాటు ఆ ప్రాంత సంస్కృతి, మ‌త‌సామ‌ర‌స్యం ఉట్టిప‌డేలా రూపొందించారు. గణతంత్ర వేడుకల్లో లడఖ్ శకటం ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన శకటం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. త్వరలో నిర్మించబోయే రామమందిరం నిర్మాణంతో శకటం తయారు చేశారు. మరోవైపు సైన్యం విన్యాసాలు కూడా వీక్షకులకు కనువిందు చేశాయి.

 

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన లడఖ్ శకటం