వైద్య విద్యార్థిని ఆత్మహత్య.. నరేష్ కారణమంటూ సూసైడ్ నోట్

76

ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. మనోవేదనకు గురై కొందరు, మానసిక స్థితి బాగోక మరికొందరు, పనివత్తిడి తట్టుకోలేక ఇంకొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ప్రేమ జంటల ఆత్మహత్యలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో వైద్యవిద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

మంగు నాగరాజు, జయలక్ష్మి దంపతుల కుమార్తె దేవి ప్రియాంక. గుంటూరు జిల్లా కాటూరులోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పల్మనాలజీ సెకండీయ‌ర్ చదువుతుంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా విజయవాడకు వచ్చింది. శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు దేవి ప్రియాంక రాసిన సూసైడ్ నోట్, లాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్ లో తన ఆత్మహత్యకు నరేష్ కారణమని రాశారు ప్రియాంక. దింతో పోలీసులు నరేష్ ను గుర్తించే పనిలో పడ్డారు. ఆమె స్నేహితులకు ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

వైద్య విద్యార్థిని ఆత్మహత్య.. నరేష్ కారణమంటూ సూసైడ్ నోట్