ఒకే విడతలో మూడు దూడలు.. గోమాత ఘనత

435

ఆవు ఈనిందంటే ఆ ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కొందరైతే చిన్నపాటి వేడుక కూడా నిర్వహిస్తారు. అదే అవుకు రైతుకు ఉన్న అవినాభావసంబంధం. ఇక ఆవు ఒక్క దూడకు జన్మనిస్తేనే సంబురపడే యజమాని మూడు దూడలకు జన్మనిస్తే ఆ సంతోషానికి అవధులు ఉండవు. అటువంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని కారంపూడి మండలం ఇనపరాజుపల్లె గ్రామంలో రాజనాల కొండలు అనే రైతు ఆవు ఒకే ఈతలో మూడు దూడలకు జన్మనిచ్చింది. మూడు దూడలు ఆరోగ్యాంగా ఉన్నాయి. దింతో రైతు తెగ సంబరపడిపోతున్నారు.

 ఇందులో రెండు పెయ్య దూడలు, ఒక కోడె దూడ ఉన్నాయి. మూడు కూడా పుట్టినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాయి. దీంతో గ్రామస్తులు ఆ గోమతాను వింతగా చూస్తున్నారు. అంతేకాదు పసుపు కుకుంమతో అలంకరించి పూజలు కూడా చేశారు.

ఇక విషయం తెలుసుకున్న వైద్యులు ఆవును పరీక్షించారు. ఆరోగ్యాంగా ఉన్నట్లు తెలిపారు. డాక్టర్లుborn మాట్లూడుతూ ఆవు ఆండాశయంలో బీజం విడిపోయి పాలి జైగోట్ గా మారడం వల్ల ఒకటికంటే ఎక్కువ దూడలు జన్మిస్తాయని.. ఈ ఆవు విషయంలోనూ అదే జరిగిందని వివరించారు. విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామాలవారు అవును చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ సందర్బంగా రైతు మీడియాతో మాట్లాడుతూ.. తన ఆవు మూడు దూడలకు జన్మనివ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

 విషయం తెలుసుకున్న పశువైద్యులు గ్రామానికి వెళ్లి ఆవు, దూడలను పరిశీలించారు. వాటికి అవసరమైన మందులను అందించారు. డాక్టర్లు మాట్లూడుతూ ఆవు ఆండాశయంలో జైగోట్ (బీజం) విడిపోయి పాలి జైగోట్ గా మారడం వల్ల ఒకటికంటే ఎక్కువ దూడలు జన్మిస్తాయని.. ఈ ఆవు విషయంలోనూ అదే జరిగిందని వివరించారు. 

ఒకే విడతలో మూడు దూడలు.. గోమాత ఘన