రజనీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ లో కరోనా కలకలం

101

రజనీకాంత్ తాజా చిత్రం అన్నాత్తే షూటింగ్ లో కరోనా కలకలం రేగింది. యూనిట్ సభ్యుల్లో 8 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో షూటింగ్ నిలిచిపోయిందని చిత్ర బృందం తెలియజేసింది. కరోనా పరీక్ష చేయించుకున్న తరువాత రజనీకాంత్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లనున్నారు.. ఇందుకోసం రజనీకాంత్ తిరిగి చెన్నైకి వెళతారా లేక హైదరాబాద్‌లోనే ఉంటారా అనేది అస్పష్టంగా ఉంది.

రజనీకాంత్, నయనతార, కీర్తి సురేష్, ఖుష్బు, మీనాతో సహా మొత్తం సిబ్బంది హైదరాబాద్‌లో ఈ ప్రస్తుత షెడ్యూల్‌లో పాల్గొన్నారు. సిబ్బంది కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. కాగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో డిసెంబర్ 14 నుంచి అన్నాత్తే సినిమా షూటింగ్ జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సిరుతై శివ అన్నాత్తే సినిమాను నిర్మిస్తున్నారు. నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.