ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి.. సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి

175

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – ఆటో ఢీకొనడంతో ఆరుగురు మరణించారు.. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన లారీ అదుపుతప్పి.. ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతులంతా గూడూరు మండలం ఎర్రకుంట్ల తండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారంతా వరంగల్‌ లో పెళ్లి బట్టలు కొనుగోలు చేసేందుకు ఆటో ఎక్కారు.

అయితే వారు ప్రయాణిస్తున్న ఆటో గూడూరు శివారుకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఆటోను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మరణించినట్టు తెలుస్తోంది. కాగా, ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హామీ ఇచ్చారు.