నారప్ప కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు

72

విక్టరీ వెంకటేష్ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా సినిమాలు రాకపోవడంతో అభిమానులు కొంత నిరాశలో ఉన్నారు. కాగా వెంకటేష్ హీరోగా నారప్ప సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మూడు వారాల షెడ్యూల్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అనుమతులు వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోని షూటింగ్ మొదలు పెట్టి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

ప్రస్తుతం దానికి సంబంధించిన డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. తమిళ సినిమా ‘అసురన్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ‘నారప్ప’ను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ జతగా ప్రియమణి నాయికగా నటిస్తోంది.

ఇక త్వరలో సినిమా పనులన్నీ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం కానుంది. అయితే సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సుముకంగా లేరని సమాచారం. థియేటర్స్ లో 50 శాతం సీటింగ్ కు మాత్రమే అనుమతి ఇవ్వడంతో పెద్ద హీరోల సినిమాలను రిలీస్ చేస్తే నష్టం వచ్చే అవకాశం ఉంది.

అందుకే ‘నారప్ప’ సినిమా రిలీజ్ విషయంలో తాము తొందరపడదల్చుకోలేదని సురేశ్ బాబు చెబుతున్నారు. పక్కా ప్లానింగ్ తో బాలెన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి, థియేటర్లు నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి పొందిన తర్వాతే ‘నారప్ప’ను విడుదల చేస్తారట.

నారప్ప కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు