దారుణం : – 540 జింకలను కాల్చి చంపారు

93

కసాయి అంటే ఎలా ఉంటాడో వీరిని చూపిస్తే యిట్టె అర్థమై పోతుంది. క్రూరత్వం పరాకాష్టకు చేరి ఏకంగా 540 మూగ జీవాలను అత్యంత క్రూరంగా గన్స్ తో కాల్చి చంపారు దుర్మార్గులు. అడవుల్లోకి వెళ్లి దొంగచాటుగా నక్కి 540 జింకలను కాల్చి చంపారు. అది చాలదన్నట్లు వాటి మృతదేహాలతో ఫోటో దిగారు.. ఈ దారుణ ఘటన పోర్చుగల్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ముర్కులంతా స్పానిష్ వేటగాళ్ళని పోర్చుగల్ దేశ అధికారులు చెబుతన్నారు. వీరు గన్స్ తో జింకలను, అడవి పందులను షూట్ చేసి చంపారని తెలిపారు. మొత్తం 16 మంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అధికారులు చెబుతున్నారు.

పోర్చుగల్ లోని లిస్బన్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ దుశ్చర్యలు పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటనపై పోర్చుగల్ లో ఆగ్రహజ్వాలలు రేకెత్తుతున్నాయి. దుండగులను అరెస్టు చేయాలని.. వారిని ఉరి తీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై పోర్చుగీస్ పర్యావరణ శాఖ మంత్రి జె. ఫెర్నాండెజ్ స్పందిస్తూ… ఇది అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు. దీనిపై పోర్చుగల్ ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుండగులను నడిరోడ్డుపై కాల్చి చంపాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం తక్షణమే నిందితులను పట్టుకొని శిక్షంచకపోతే దేశ వ్యాప్త ఉద్యమం చేపడతామని జంతు ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. కాగా స్పానిష్ ఆవుల కాపరులు ఎక్కువగా వేటాడుతుంటారు. వారి వద్ద గన్నులు ఉంటాయి. అడవుల్లో ఆవులను మేపే సమయంలో క్రూరమృగాలు దాడి చేసే అవకాశం ఉండటంతో వారు గన్స్ తీసుకోని వెళ్లొచ్చు. అయితే వీటిని చంపిన వారు ఆవుల కాపర్లు కాదంట. ఈ 16 మందిలో కొందరు గతంలో కూడా మూగ జీవాలను వేటాడినట్లుగా తెలుస్తుంది. అయితే వారిని ఎం చేస్తారు అనేది ఇప్పుడు సస్పెన్షన్.

దారుణం : – 540 జింకలను కాల్చి చంపారు