కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోడీ

151

భారత ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో దేశ వ్యక్తంగా జరుగుతున్నా కరోనా వ్యాక్సినేషన్ రెండవ దశలో భాగంగా టీకా తీసుకున్నారు. మోడీ హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన కొవాక్సిన్ టీకా తీసుకున్నట్లు సమాచారం. మార్చి 1 తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 60 సంవత్సరాలు నిండిన వృద్దులకు 45 ఏళ్ళు దాడి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికీ టీకా ఇస్తున్నారు. ఇక ఇప్పటికే వైద్య, పోలీస్ సిబ్బందికి టీకా పంపిణి కార్యక్రమం పూర్తైంది వీరికి రెండో డోస్ ఇవ్వాల్సి ఉంది.అర్హులైన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని పీఎం మోడీ సూచించారు. మనమంతా కలిసి కొవిడ్ రహిత దేశంగా ఇండియాను మార్చేద్దాం. అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో పోస్టు కూడా చేశారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోడీ