చలికాలం ఈ ఆహార పదార్ధాలు తీసుకోండి.

364

డిసెంబర్, జనవరి నీళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దింతో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ కాలంలో తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అయితే, ఇమ్యూనిటీ పవర్‌ పెరగాలన్నా..శరీరంలో వేడిపుట్టాలన్నా కొన్ని రకాల ఆహారపదార్థాలు తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది. అందులో ముందువరుసలో ఉంటుంది పల్లీపట్టి. వీటినే చిక్కీలు అంటారు. సులభంగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు. ఇది రుచికరమైనదేకాదు.. ఆకలి బాధలు తీర్చేందుకు, శరీరాన్ని బలోపేతం చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆరోగ్య ప్రయోజనాలు..

పల్లీల్లో ఉండే సుగుణాలు, బెల్లంలోని ఆరోగ్య లక్షణాలు చలికాలంలో శరీరంలో వేడి పుట్టించి జబ్బులకు దూరంగా ఉండేలా చేస్తుంది. పల్లీల్లో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సినన్ని పోషకాలుంటాయి. బెల్లంలో ఇనుము, కాల్షియం తదితర పోషకాలు ఉంటాయి. ఇవి రెండూ కలవడం వల్ల శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది. పల్లీ పట్టీల వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది.
పల్లీలను బెల్లంతో కలిపి తినడం వల్ల రక్తహీనత దూరమవుతుంది. బెల్లం, వేరుశనగలను కలిపి తినడం వల్ల మహిళల్లో రుతు సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. పల్లీలో ఉండే పీచు పదార్థాలు ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తాయి. వేరుశనగ, బెల్లం పట్టీలు ఒంట్లోని విషతుల్యాలను బయటకు పంపేస్తాయి. బెల్లంలో ఉండే కాల్షియం, ఇతర ప్రొటీన్ల వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా మారతాయి. వేరుశనగలోని సెలీనియం, బెల్లంలోని మెగ్నీషియం, ఇనుము సంతానోత్పత్తి సంబంధిత సమస్యలను మెరుగుపరచడంలో సహాయపడుతాయి.

చలికాలం ఈ ఆహార పదార్ధాలు తీసుకోండి.