Rohtak : రెజ్లింగ్ సెంటర్ పై కాల్పులు.. చిన్నారితో సహా ఐదుగురు మృతి

267

హర్యానాలోని రోహితక్ లో దారుణ ఘటన జరిగింది.. పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి రెజ్లింగ్ సెంటర్ పై కాల్పులు జరిపాడు.. ఈ కాల్పుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.. దింతో స్థానికులు వీరిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళా రెజ్లర్లు, కోచ్ తోపాటు మూడేళ్ళ చిన్నారి కూడా ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దుండగుడిని గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మృతులను ప్రదీప్ మాలిక్‌, పూజ, సాక్షిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై రోహితక్ రేంజ్ ఐజి సందీప్ ఖిర్వార్ మాట్లాడుతూ.. నిండుడి కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని తెలిపారు. రెజ్లింగ్ కోచ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.

రెజ్లింగ్ సెంటర్ పై కాల్పులు.. చిన్నారితో సహా ఐదుగురు మృతి