గాల్వన్ లో 45 మంది చైనా సైనికులు మృతి.

157

తూర్పు లద్దాఖ్ లో గతేడాది భారత్ – చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45 మంది చైనా సైనికులు మృతిచెందినట్లుగా రష్యా వార్త సంస్థ ప్రకటించింది. 2020 జూన్ నెలలో జరిగిన ఈ ఘర్షణలో 20 మంది భారత జవాన్లుఅమరులైన విషయం విదితమే.. అయితే ఇదే సమయంలో 45 మంది చైనా సోల్డర్లను భారత జవాన్లు మట్టుబెట్టినట్లుగా రష్యా పత్రిక ప్రధాన శీర్షికలో విషయాన్ని పొందుపరిచింది. కాగా ఆయుధాలతో వచ్చిన చైనా సైనికులు విచక్షణ రహితంగా భారత జవాన్లపై దాడి చేశారు. వారిపై తిరగబడిన భారత జవాన్లు చేతులతోనే చైనా సైనికుల తలలు విరిచి పడేశారు. వారి చేతుల్లోని రాడ్లను లాక్కొని ఎదురుదాడి చేశారు.

ఇదిలా ఉంటే భారత్‌-చైనా దేశాల సరిహద్దుల మధ్య తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించుతూ ఇరు దేశాల బలగాలను ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో రష్యా మీడియా సంస్థ విడుదల చేసిన నివేదికలో, గల్వాన్‌ ఘటనలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. 20మంది భారత సైనికులు అమరులైనట్లు పేర్కొంది. ఈ ఘటనపై అప్పట్లో అమెరికా కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. 70 మంది వరకు చైనా సైనికులు మృతి చెంది ఉంటారని అమెరికా భావించింది.

గాల్వన్ లో 45 మంది చైనా సైనికులు మృతి.