400 మంది విద్యార్థులు కిడ్నాప్

110

ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలపై ఉగ్రవాదులు కక్షకట్టారు. నైజీరియా దేశాన్ని టార్గెట్ చేసుకొని దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. గత నెలలో 50 మందికిపైగా కూలీలను హతమార్చారు. ఇక తాజాగా 400 మంది బాలికలను అపహరించారు. నైజీరియాలోని కట్సీనా రాష్ట్రంలో బోకో హరమ్ టెర్రరిస్ట్ గ్రూప్ కి చెందిన సాయుధ దుండగులు శుక్రవారం ఒక మాధ్యమిక పాఠశాలపై దాడి చేశారు. సుమారు 400 మంది విద్యార్థులను అపహరించుకు పోయారు.

600 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో 400ని ట్రక్కుల్లో ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఇక వీరి ఆచూకీ కోసం నైజీరియన్ ఆర్మీ, స్థానిక పోలీసులు, వాయుసేన అధికారులు గాలింపు చేపట్టారు. తమ పిల్లలను టెర్రరిస్టులు తీసుకెళ్లడంతో వారి తల్లిదండ్రులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను తీసుకురావాలని వేడుకుంటున్నారు. కాగా ఇంత పెద్ద మొత్తంలో బాలికల అపహరణ జరగడంతో ప్రపంచ దేశాలు కూడా దీనిపై దృష్టి పెట్టాయి. విద్యార్థినిలను వెతికేందుకు సహాయం చేస్తామని మాట ఇచ్చారు.

400 మంది విద్యార్థులు కిడ్నాప్