కూలిన విమానం.. ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు దుర్మరణం

76

బ్రెజిల్ లో ఘోరం జరిగింది. ఫుట్‌బాల్ ఆటగాళ్ళు ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. దీంతో నలుగురు ఆటగాళ్ల తోపాటు మరో ఇద్దరు దుర్మరణం చెందారు.. టొకాన్టిన్ రాష్ట్రంలోని ఈ విమానం కూలింది.. ఇందులో ఫుట్‌బాల్ టీం అధ్యక్షుడితో పాటు పైలట్ కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో టొకాన్టిన్ రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొంది.

విలానోవా జట్టుతో ఆటలో పాల్గొనేందుకు ఆటగాళ్లు సిద్ధమయ్యారు.. అయితే వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో సపరేట్ విమానంలో పంపించారు. ఇందులో ఫుట్‌బాల్ టీం అధ్యక్షుడు కూడా ఉన్నారు.. అయితే ఈ విమానం టేకాఫ్‌ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిందని ఆ దేశ మీడియా వెల్లడించింది.