ఢిల్లీ అల్లర్లపై NIA దర్యాప్తు..

140

గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసకు దారితీసిన విషయం తెలిసిందే. ర్యాలీలో పాల్గొన్న 200 మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోంశాఖ కేసు విచారణ బాధ్యతను NIA కి అప్పగించింది. పూర్తి వివరాలు సేకరించాలని తెలిపారు. కాగా జనవరి 26 రోజు రైతులు ఢిల్లీలోని ఎర్రకోటపైకి ఎక్కి జెండా పెట్టిన విషయం విదితమే అయితే దీనిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. మరోవైపు రైతులు పోలీసులపై దాడి చేయడాన్ని దేశ ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు ప్రజలు. అయితే రైతుల ర్యాలీని కొన్ని సంఘాలు సమర్దిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై నెపం వేస్తున్నాయి.

మరోవైపు రైతుల దాడిలో గాయపడిన పోలీసులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పోతున్నారు. వీరిలో కొందరు డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అమిత్ షా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ లను కలిశారు. వారి ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారు చూపిన తెగువను మెచ్చుకున్నారు. రైతులు పక్కదారిలో వెళ్లే సమయంలో వారిని అడ్డుకునేందుకు మీ వంతుగా తీవ్ర ప్రయత్నం చేశారని అమిత్ షా గుర్తు చేశారు. మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రికి వైద్యులకు తెలిపారు అమిత్ షా.

ఢిల్లీ అల్లర్లపై NIA దర్యాప్తు..