వైసీపీకి మద్దతుగా 33 మంది వలంటీర్ల రాజీనామా

168

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పర్వం కొనసాగుతుంది. ఫిబ్రవరి 9న మొదటివిడత ఎన్నికలు పూర్తవగా, 13 న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే 33 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వలంటీర్లును ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని చెప్పడంతో వారు బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్బంగా నిమ్మగడ్డపై మండిపడ్డారు. మొబైల్స్ రిటర్న్ తీసుకోవడం దారుణమని తెలిపారు. తాము వైసీపీ మద్దతుదారుల విజయం కోసం పనిచేస్తామని వివరించారు.

ఇక ఇదిలా ఉంటే, రెండొవ విడత పంచాయితీ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ నెల 13 న రెండో విడత పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ పర్వం పూర్తయింది. ఇక రెండవ విడతకు సంబందించిన ఏకగ్రీవాలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 534 స్థానాల్లో ఏకగ్రీవంగా సర్పంచులు ఎన్నికైనట్లు తెలిపారు. ఇక మరికొన్ని చోట్ల వేలంపాటలు నిర్వహిస్తున్నారు. అధికారులకు తెలియకుండా ఈ పాటలు సాగుతున్నాయి.

వైసీపీకి మద్దతుగా 33 మంది వలంటీర్ల రాజీనామా