3229 Weddings On One Day: పెళ్లిళ్లలో ఇదే సరికొత్త రికార్డు!

135

3229 Weddings On One Day: మన దేశంలో పెళ్లి అనే తంతుకి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే. సంప్రదాయం ఏదైనా.. పెళ్లి జరిగే తీరులో మార్పులు ఎన్ని ఉన్నా బంధంలో మాత్రం ఎలాంటి తేడాలు ఉండవు. అందుకే మన దేశంలో ఆ బంధానికి అంత విలువ ఉంటుంది. పెళ్లి అనేది ఇద్దరి మనుషులను దగ్గరి చేసే పవిత్రమైన బంధం కాగా భారత వివాహా వ్యవస్థ పటిష్టమైనది ప్రపంచంలోనే పేరుంది. స్ర్తీ పురుషులకు జీవితంలో మరుపురానిది పెళ్లి కాగా కనిపెంచిన తల్లిదండ్రులు ఇదొక బాధ్యతగా మంచి జీవితం ఇవ్వాలని తాపత్రయ పడతారు.

మనదేశంలోనే సామూహిక పెళ్లిళ్లు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఒకేసారి వేల పెళ్లిళ్లు జరగడం మాత్రం చాలా అరుదు. అందునా మూడు వేల పెళ్లిళ్లు అంటే మాటలు కాదు. మన దేశంలో ఒకేసారి ఒకేరోజు 3229 పెళ్లిళ్లు జరిగాయి. ఇంత వరకు అన్ని పెళ్లిళ్లు ఒకే రోజు జరగలేదు. ఇన్ని పెళ్ళిళ్ళు ఒకే రోజు జరిగినందుకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఈ విశేషం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం రాయపూర్ లో ఒకేరోజు 3229 పెళ్లిళ్లు జరిగాయి. దీంతో ఈ కార్యక్రమం ప్రపంచంలోనే రికార్డ్ సృష్టించింది.

ఎక్కడా కూడా ఒకేరోజు ఇన్ని పెళ్లిళ్లు జరుగలేదు. అందుకే ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. రాయపూర్ లోని ఇండోర్ స్టేడియమ్ లో 233 పెళ్లిళ్లు జరిగగా అదే సమయంలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని 22 జిల్లాల్లో సామూహిక వివాహాలు జరిపారు. ఈ పెళ్లిళ్లకు పెద్దగా ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ హాజరయ్యారు. హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అన్ని మతాలు వారు ఒకే వేదికలో పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ సామూహిక పెళ్ళిళ్ళను ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగగా.. పవిత్రమైన మాఘ పూర్ణిమ రోజు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా కన్య వివాహ్ యోజన కింద కొత్త జంటలకు 15 వేల రూపాయలకు బదులుగా 25 వేల రూపాయలను అందజేయనున్నట్లు ప్రకటించడంతో నూతన జంటలు ఆనందం వ్యక్తం చేశారు.