నగర మేయర్ గా 21 ఏళ్ల విద్యార్థిని

75

మేయర్ అంటే మాములు పదవి కాదు.. ఈ పదవికి హేమాహేమీలు పోటీ పడుతుంటారు. నాకు కావాలి అంటే నాకు కావాలంటూ అధిష్టానం వద్ద గోల చేస్తుంటారు. అలాంటి పేరు ప్రఖ్యాతి తెచ్చే పెట్టె మేయర్ పదవి 21 ఏళ్ల విద్యార్థినిని వరించింది. తాజాగా కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 941 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ 516పైగా స్థానాల్లో విజయకేతనం ఎగరేసి పూర్తి ఆధిక్యతను కనబర్చింది.

కేరళ రాజధాని తిరువనంతపురం పీఠాన్ని కూడా ఎల్డీఎఫ్ కైవసం చేసుకుంది. ఇక ఇక్కడ మేయర్ గా 21 ఏళ్ల బీటెక్ విద్యార్థిని ఆర్య రాజేంద్రన్ ఎంపిక చేసింది పార్టీ అధిష్టానం. ప్రస్తుతం ఈమె ఎల్‌బీఎస్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్నారు. మరోవైపు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. చురుకైన విద్యార్థిని కావడంతో పార్టీ ఈమెకు ఈ అవకాశం ఇచ్చింది.

కాగా 21 ఏళ్లకే మేయర్ కుర్చీ వరించడంతో ఆర్య రికార్డ్ నెలకొల్పింది. అంత చిన్న వయసులు మేయర్ పీఠం అధిరోహించిన వారు ఎవరు లేరు. కాగా విపక్ష కూటమి నుంచి సీనియర్‌ అభ్యర్థి బరిలో నిలిచినప్పటికీ.. ఆమె ముందు నిలవలేదు. ఇక ఈ ఎన్నికపై ఆమె స్పందిస్తూ తనపై పార్టీ పెద్దలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్ కోసం పనిచేస్తానని తెలిపారు. ఇక అతి చిన్న మేయర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ పదవి వరిస్తుందని ఆర్య కూడా ఉహించలేదట, ఊహించని పదవి దక్కడంతో తెగ సంబరబడిపోతున్నారు ఆర్య రాజేంద్రన్.

నగర మేయర్ గా 21 ఏళ్ల విద్యార్థిని