ఈ ఏడాది ఫుల్ డిమాండ్ ఉండే ఉద్యోగాలు ఇవే..

15917

2021 వస్తూ, వస్తూ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రపంచంలో డిజిటలైజేషన్ పెరిగిపోతుంది. దానికి తగ్గట్లుగా ఉద్యోగ సృష్టి కూడా జరుగుతుంది. డిజిటల్ లో క్రమక్రమంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ ఏడాది 15 రంగాల్లో ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయని కెరీర్ డెవలప్మెంట్ ఆన్ లైన్ సర్వీస్ లింక్డిన్ చేసిన సర్వేలో వెల్లడైంది. 2021లో ఫ్రీలాన్స్ కంటెంట్ క్రియేట‌ర్స్‌, మార్కెటింగ్‌, సోష‌ల్ మీడియా, డిజిట‌ల్ మార్కెటింగ్‌, సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణుల‌కు మంచి ఉద్యోగ అవ‌కాశాలు ఉంటాయ‌ని ఆ సంస్థ తెలిపింది.

జాబ్స్ ఆన్ ద రైజ్ పేరుతో లింక్డిన్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న 15 ఉద్యోగాల జాబితాను విడుద‌ల చేసింది. లింక్డిన్ లిస్ట్ లో కంటెంట్ క్రియేటర్లు టాప్ ప్లేస్ లో ఉండటం విశేషం. కంటెంట్ క్రియేటర్ల లోటు దేశంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని ఈ సంస్థ తెలిపింది. 76 కోట్ల మొబైల్ యూజర్లు ఉన్న ఇండియాలో కంటెంట్ క్రియేటర్లకు ఈ ఏడాది ఫుల్ డిమాండ్ ఉంటుందని లింక్డిన్ స్పష్టం చేసింది. ఇక మార్కెటింగ్ కూడా డిజిటలైజేష్ కావడంతో ప్రముఖ కంపెనీలు సోషల్ మీడియాపైనే ఆధారపడి మార్కెటింగ్ చేస్తాయని, ఈ విధంగా ఉద్యోగ సృష్టి జరుగుతుందని తెలిపారు. అదే స‌మ‌యంలో డేటా భ‌ద్ర‌త‌కు పెరుగుతున్న ప్రాధాన్య‌త నేప‌థ్యంలో సైబ‌ర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ రోల్స్‌కు కూడా డిమాండ్ ఉండ‌నుంద‌ని లింక్డిన్ స్ప‌ష్టం చేసింది.

ఈ ఏడాది ఫుల్ డిమాండ్ ఉండే ఉద్యోగాలు ఇవే..