Bitter Memories 2020 మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇవే

133

2020, దీన్ని తలచుకుంటేనే వెన్నులో ఒణుకు పుడుతుంది.. ఈ ఏడాది జరిగిన ఘోరాలు, దారుణాలు, ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు, మరే ఏడాదిలో జరిగి ఉండవు. వందల మందిని రోడ్లపై పడేసింది. జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ప్రముఖులను తీసుకెళ్లింది. ఇక మొత్తంగా చెప్పాలి అంటే 2020 సంవత్సరానికి వైరస్ వచ్చింది.. దీనికి ఏడాది చివరి వరకు కూడా యాంటీ వైరస్ అందుబాటులోకి రాలేదు.

2020 నష్టాలు

కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని కుదేలు చేసింది. కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మిలియన్ల మంది ఆర్ధికంగా నష్టపోయారు. చనిపోయిన వారిలో ప్రముఖులు ఉన్నారు. కరోనా కారణంగా సామాన్యులతోపాటు ప్రజా ప్రతినిధులు ప్రాణాలు విడిచారు. వారిలో ప్రణబ్ ముఖర్జీతో పాటు, బాలసుబ్రహ్మణ్యం, పలువురు ప్రముఖులు ఉన్నారు. ఇక మరో వైపు ఆత్మహత్యలు కూడా ఈ ఏడాది అధికంగా జరిగాయి. ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందారు. అదే విధంగా ఆర్ధిక ఇబ్బంద్దులు తట్టుకోలేక పదుల సంఖ్యలో సినిమా ఆర్టిస్టులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఉద్యోగాలు ఉష్ కాకి

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. డైలీ లేబర్ పని దొరక్క ఇబ్బందులు పడ్డారు. ఇక వలసకార్మికుల బాధలు వర్ణనాతీతం. వేలకిలోమీటర్లు కాలినడకన వెళ్లి తమ గ్రామాలకు చేరుకున్నారు. కొందరు నడక ప్రారంభించి మద్యంలోనే మృతి చెందారు. నిర్మాణాలు నిలిచిపోయాయి.. కొత్త ప్రాజెక్టులు ఆగిపోయాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలు మూతబడ్డాయి.
కార్పొరేట్ కంపెనీలు క్లోస్ అయ్యాయి. సినీ పరిశ్రమ చితికిపోయింది. మార్కెటింగ్ మొత్తం ఆగమైంది. అమ్మకాలు తగ్గిపోయాయి. ఆర్ధిక వ్యవస్థ పడిపోయింది. ప్రజలు డబ్బులేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

జీతాలు ఇవ్వలేని స్థితి

రాబడి లేనిది ఎవరు మాత్రం జీతాలు ఇవ్వగలుగుతారు. ప్రభుత్వం కూడా జీతాల్లో కోత వేసింది. ఇచ్చేందుకు డబ్బులు లేవని తెగేసి చెప్పింది. కోలుకొని ఆర్ధిక వ్యవస్థ బలపడితే భవిష్యత్ లో కట్ చేసిన జీతాలు ఇస్తామని తెలిపింది. ఇక ప్రైవేట్ కంపెనీలు కూడా చాలా వరకు ఉద్యోగులను తొలగించాయి. జీతాల్లో కోత విధించాయి. వర్క్ ఫ్రొమ్ హోమ్ ఇచ్చి ఆఫీసులను క్లోజ్ చేశాయి. హైదరాబాద్ నగరంలోని వందల సంఖ్యలో సాఫ్ట్ వేర్ కంపెనీల ఆఫీసులు ఇప్పటికి తెరుచుకోలేదు. వర్క్ ఫ్రొమ్ హోమ్ విధానం కంపెనీలకు కలిసొస్తుండటంతో ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయిస్తున్నాయి.

రవాణా వ్యవస్థ కుదేలు

రోడ్డు, వాయు, జలరవాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. కరోనా కారణంగా ఇతరదేశాల్లో చిక్కుకున్న దేశస్తులను తీసుకొచ్చారు.. ఈ క్రమంలోనే వారు కరోనాను తమ వెంట మోసుకొచ్చారు. దింతో దేశంలో కరోనా కేసుల సంఖ్య అధికంగా పెరిగింది. దింతో దేశంలో లాక్ డౌన్ ను దశల వారీగా తొలగిస్తూ వచ్చింది కేంద్రం.

 

2020 మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇవే