15 రోజుల్లో పోలవరం సందర్శనకు వస్తా – ”గజేంద్ర సింగ్”

81

ఏపీ ఆర్ధిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జనవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖామంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారు. పోలవరానికి సంబందించిన పలు కీలక అంశాలను ఆయన వద్ద ప్రస్తావించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఇరువురు నేతలు పోలవరంపై 2017లో చంద్రబాబు వేసిన చిక్కుముడులను విప్పుతున్నామన్నారు. ఈ సందర్భంగా పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రమంత్రికి మెమెరాండం ఇచ్చామని పేర్కొన్నారు. ప్రాజెక్టు విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించారని వివరించారు. పోల‌వ‌రాన్ని సంద‌ర్శించాల‌ని కోరగా.. 15 రోజులలోపే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంత్రులు వివరించారు.

15 రోజుల్లో పోలవరం సందర్శనకు వస్తా – ”గజేంద్ర సింగ్”