13 గ్రామపంచాయితీలకు ఎన్నికలు బ్రేక్

66

కడప జిల్లాలో కొత్త ఏర్పాటు చేసిన 13 గ్రామపంచాయితీలకు ఎన్నికలు నిర్వహించవద్దని హైకోర్టు స్టే ఇచ్చింది. విభజనను వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా ఈ 13 గ్రామపంచాయితీల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు ఎన్నికల నిలుపుదల చెయ్యాలని స్టే ఇచ్చింది. దీనిపై తీర్పు వెలువరించే వరకు ఎన్నికలు వాయిదా వెయ్యాలని తెలిపింది.

ఇక ఇప్పటి వరకు వివిధ కారణాలతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 90 పంచాయితీల్లో ఎన్నికలు నిలిపివేశారు. ఇక నేటి నుంచి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్ నియోజకవర్గాల్లోని 206 గ్రామపంచాయితీలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గొడవలు జరగకుండా బందోబస్తూ ఏర్పాటు చేశారు.

13 గ్రామపంచాయితీలకు ఎన్నికలు బ్రేక్