10 టీవీలో ఆ దూకుడు ఏంటి ?

416
10tv live news channel

సాధారణ ప్రేక్షకులకు, అప్పుడప్పుడు వార్తలు చూసే వారికి 10టీవీ అనే ఛానెల్ తెలుగులో కొత్తగా వస్తుందేమో అనిపిస్తుంది. కాని మీడీయా సర్కిళ్లలో ఉన్న వారు, న్యూస్ ఛానెల్స్ ను రెగ్యూలర్ గా ఫాలో అయ్యే వాళ్లు మాత్రం 10టీవీ లో ఇదేం మార్పు, ఇదెక్కడి మార్పు అని చర్చించుకుంటూన్నారు . తెలుగులో టాప్ అనుకున్న రెండు తెలుగు న్యూస్ ఛానెల్స్ కి ధీటూగా బ్రేకింగ్ న్యూస్ పడటం, టాప్ ఛానెల్స్ కు పోటీగా న్యూస్ ని డ్రైవ్ చేయడం వంటివి చూసి ఇది పాత 10టీవీయేనా అని అనుకుంటున్నారు.

క్వశ్చన్ అవర్ పేరుతో ఒక సీనియర్ యాంకర్ , ఒక సీనియర్ రిపోర్టర్ ను ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చి పొలిటీకల్ లీడర్స్ ని ఇంటర్వ్యూ చేస్తున్న తీరు జనాన్ని బాగా ఆకట్టుకోవడంతో ఈ ఛానెల్ అంటే ఏంటో ప్రస్తుతం అందరికి తెలిసివచ్చింది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిని చేసిన తప్పులను ఎత్తిచూపి ముప్పుతిప్పలు పెట్టిన ఇదే ఛానెల్ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి క్వశ్చన్ అవర్ పేరుతో ఆయన అంతర్గతాన్ని ఆవిష్కరించి అసలు రేవంత్ రెడ్డి అంటే ఏంటో అందరికి తెలియజేసింది. దొరికిందే ఛాన్స్ అని తమ జ్ఞానాన్ని వచ్చిన గెస్ట్ మీద రుద్దకుండా ప్రజా సమస్యలపై వారి మనోభావలను పంచుకునేందుకు వేదికగా నిలుస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఆకట్టుకున్న కారణంగానే ఏపీ మంత్రి కొడాలినాని క్వశ్చన్ అవర్ కు వచ్చారనేది సీక్రెట్ టాక్.

ఇక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలతో దూసుకెళ్తున్న 10టీవీ వార్తలను ప్రముఖ దినపత్రికలు మార్చి రాసుకోని తమ ఫ్రంట్ పేజి కథనాలుగా ప్రచురిస్తున్నాయి. తెలంగాణ నెక్స్ట్ ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ జరుగుతున్న ప్రచారానికి టీఆర్ఎస్ కీలక నేత ఈటేలతోనే, ” కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి “, అని చెప్పించి సంచలనం సృష్టించింది 10టీవీ. అక్షరదోషాలతో స్క్రీన్ మీద నత్తనడకన నడిచే వార్తలతో విసుగుపుట్టించిన ఆ ఛానెలే ఇప్పుడు కొత్త ఉత్సాహాంతో దూసుకుపోతుంటే మీడియా సర్కిల్స్ లోని ప్రతి ఒక్కరు దీనిపై చర్చలకు తెరలేపారు.

గతంలో దుబ్బాక ఎన్నికలను, ఈ మధ్యకాలంలో పోటాపోటీగా నడిచిన GHMC ఎన్నికలను నిష్పక్షపాతంగా కవర్ చేసి అభ్యర్థులగెలుపోటములపై చేసిన చక్కని విశ్లేషణ ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. ఎక్కడో లాస్ట్ నుండి మూడు నాలుగు స్థానాల్లో ఉండే ఈ ఛానెల్ ఇప్పుడు మొదటి మూడు నాలుగు స్థానాల కోసం పోటీపడుతోంది. పాత కమ్యూనిస్ట్ పైత్యాన్ని వదిలించుకోని ఛానెల్ ని పరుగులు పెట్టించడానికి చేసిన ప్రయత్నాలు స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నూతన విధానాన్ని ఛానెల్ భవిష్యత్తులో ఇలాగే కొనసాగిస్తుందో లేదో చూడాలి.