పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

248

కరోనా కారణంగా ఈ విద్యాసంవత్సరంలో ఇంటివద్ద ఉండే చదువుకున్నారు విద్యార్థులు.కొన్ని రాష్ట్రాల్లో నవంబర్ నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే తెలంగాణలో మాత్రం ఇంతవరకు పాఠశాలలు ప్రారంభం కాలేదు. ఆన్లైన్ లోనే క్లాసులు చెబుతున్నారు. ఇక ఫిబ్రవరి 1 నుంచి 9 వ తరగతి నుంచి ఆ పై క్లాసులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే పదోతరగతి పరీక్షల షెడ్యూల్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.

పాఠశాల విద్యాశాఖ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మే 17వ తేదీ నుంచి పదవతరగతి పరీక్షలు జరుగుతాయని ఆమె తెలిపారు. 26 తేదీకి పరీక్షలు పూర్తవుతాయి. ప్రతి ఏడూ పదోతరగతి విద్యార్థులు 11 పరీక్షలు రాసేవారు. కానీ ఈ ఏడాది వాటిని ఆరుకే కుదించారు. కరోనా కారణంగా సెకండ్ పేపర్ ఫస్ట్ పేపర్ కలిపి ఒకే పేపర్ తో పరీక్ష నిర్వహించనున్నారు. మే 27 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు.

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల