10th Class Exams : పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

214

ఆంధ్ర ప్రదేశ్ లో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖామంత్రి ఆదిమూలం సురేష్ బాబు విడుదల చేశారు. జూన్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 7 తేదీ నుంచి 16 వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో 11 పేపర్లు ఉండేవి.. కానీ కరోనా కారణంగా ఒక్కో సబ్జెక్టుకు ఒక పేపర్ తోనే పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల సమయంలో కరోనా నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు మంత్రి ఆదిమూలం సురేష్.

కోవిద్ కారణంగా కోల్పోయిన కాలాన్ని గదిలో పెట్టేందుకు దశలవారీగా తరగతులు మొదలైనట్లు మంత్రి తెలిపారు. పాఠశాలలు యధావిధిగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఇక జూన్ 5 తేదీ వరకు తరగతులు కొనసాగుతాయని వివరించారు. మే 3 నుంచి 15 వరకు 1-9 తరగతులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గతంలో లాగానే జూన్ 1 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటిస్తున్నామని తెలిపారు.

 

10th Class Exams : పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల