రూ. 100 నోట్ల రద్దుపై స్పష్టత ఇచ్చిన ఆర్బీఐ

147

దేశంలో నోట్ల రద్దు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాత 100 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నారంటూ ప్రధాన పత్రికలు కూడా వార్తలు ప్రచురించాయి. దింతో ప్రజలు ఆగమేఘాలమీద తమ వద్ద ఉన్న నగదును మార్చుకునే పనిలో పడ్డారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ వార్తలపై రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా స్పందించింది. నోట్ల రద్దుపై వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. భవిష్యత్ లో కూడా రూ. 100 రూ. 10, రూ. 5 రూపాయల నోట్లను ఉపసంహరించుకోబోమని తేల్చి చెప్పింది. ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని తెలిపింది ఆర్బీఐ. ఈ మేరకు ట్వీట్ చేశారు అధికారులు.

2016 నవంబర్ లో ఆర్బీఐ అకస్మాత్తుగా నోట్ల రద్దు చేయడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. అప్పుడు చలామణిలో ఉన్న పెద్ద నోటు వెయ్యిని 500లను ఉపసంహరిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుందేమో అని భయపడుతున్నారు ప్రజలు. దీనిపై ఆర్బీఐ క్లారిటి ఇవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

రూ. 100 నోట్ల రద్దుపై స్పష్టత ఇచ్చిన ఆర్బీఐ