తెగబడిన ఉగ్రవాదులు.. 100 మంది దారుణ హత్య

1317

గత కొద్దీ రోజులుగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ప్రజలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగి మారణహోమం సృష్టిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారు ముష్కరులు. గత సంవత్సరం నైజీరియా, యెమెన్ దేశాలల్లో ఉగ్రదాడులు చేసి వందల మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టులు, మరో 100 మందిని హత్య చేశారు. ఆదివారం సాయంత్రం పశ్చిమాఫ్రికా దేశం నైగర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు.

మరో 75 మంది గాయపడ్డారని, వారిని రాజధాని నియామేలోని దవాఖానకు తరలించామన్నారు. బోకోహారమ్‌ ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. గత శనివారం బోకోహారమ్‌ సంస్థకు చెందిన ఇద్దరిని గ్రామస్థులు చంపేశారు. దీంతో ప్రతికారేచ్ఛతో ఆదివారం సాయంత్రం ఆ రెండు గ్రామాలపై దాడిచేసి ఉగ్రవాదులు 100 మందిని కాల్చి చంపారని తెలిపారు.