నగరంలో 10 తరవగతి విద్యార్థిని అదృశ్యం

60

నగరంలో 10 తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యం కలకలం రేపింది. హయత్ నగర్ లో మౌనిక అనే పదోతరగతి విద్యార్థిని ఈ నెల 16 తేదీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కనిపించడం లేదు. కాగా ఆన్లైన్ క్లాసులు అర్ధం కావడం లేదని, తాను పాస్ అవడం కష్టమని గత కొద్దీ రోజులుగా తల్లికి చెబుతుందట విద్యార్థిని ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు సార్లు మెల్లిగా చెప్పిందట తల్లి. ప్రతి సారి ఇదే సమస్య చెప్పడంతో ఎందుకు అర్ధం కావడం లేదని మందలించిందట.

దింతో 16 తేదీ ఉదయం ఓ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు ఎక్కడ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థిని కోసం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అయితే అందులో కూడా ఎక్కడ కనిపించినట్లు తెలుస్తుంది. కూతురు కనిపించకుండా పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు..

కాగా ఆన్లైన్ క్లాసుల సమస్య ఒక్క మౌనికదే కాదు, చాలా మంది పిల్లలు ఇదే ఫిర్యాదు చేస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇంతకాలం పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు. ఒక్కసారిగా స్క్రీన్ మీదికి వచ్చే సరికి ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఇక దీనిపై కొందరు స్పందిస్తూ, తోలి ఏడాది గజిబిజిగానే ఉంటుందని, అలవాటైతే ఆన్లైన్ క్లాసెస్ బెట్టర్ అనే ఫీలింగ్ వస్తుందని తెలిపారు. బోర్డ్ పై చూసి, ఒకే సారి స్క్రీన్ పై చూడటంతో వారికీ అర్ధం కావడం లేదని నిపుణులు తెలిపారు.

నగరంలో 10 తరవగతి విద్యార్థిని అదృశ్యం