పరీక్షకు ముందే వాట్సప్ లో చక్కర్లు కొట్టిన పేపర్

270

పరీక్షల నిర్వహణ అంటే మనకు బీహార్ గుర్తుకు వస్తుంది.. పరీక్షల నిర్వహణలో ఇక్కడ ఎప్పుడు ఎదో ఒకసమస్య తలెత్తుతూనే ఉంటుంది. గతంలో అనేక సార్లు పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. ఇక పాఠశాలలో మాస్ కాపియింగ్ చేయిస్తూ అడ్డంగా దొరికిన సందర్భాలు కోకొల్లలు. ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో కూడా ఇక్కడ అనేక సార్లు తప్పులు దొర్లాయి. ఇక తాజాగా 10 వ తరగతి సోషల్, సైన్స్ పరీక్షా పత్రాలు, పరీక్షకు ముందే లీక్ అయ్యాయి. బుధవారం సోషల్, సైన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే పరీక్షకు ఒక గంట ముందే పరీక్షా పత్రాలు వాట్సప్ లో చక్కర్లు కొట్టాయి.

ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే పరీక్షలు రద్దు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్త పేపర్లతో మార్చి 8 న పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కాగా మొత్తం 16 లక్షల 68 వేలమంది విద్యార్థులు 10 వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. వీరిలో మార్నింగ్ షిఫ్ట్ లో 8,46,504 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరిక్షకంటే ముందే పేపర్ లీక్ అవడంతో పరీక్షను రద్దు చేశారు. దీనిపైన విచారణ చేపట్టిన అధికారులు ఝాఝలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కాంట్రాక్ట్‌ ఉద్యోగులు దీనికి పాల్పడినట్లు వెల్లడించారు.

వికాస్‌ కుమార్ అనే కాంట్రాక్ట్‌ ఉద్యోగి పరీక్ష పత్రాలను లీక్‌చేశాడని, వాటి ఫొటోలను వాట్సాప్‌లో పెట్టినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతనికి సహాయం చేసిన శక్తికాంత్‌ చౌదరి, అజిత్‌ కుమార్‌ అనే ఇద్దరు ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

పరీక్షకు ముందే వాట్సప్ లో చక్కర్లు కొట్టిన పేపర్