Lavanya Tripathi: హీరోను ‘అన్నా’ అనేసిన హీరోయిన్.. ఫ్యాన్స్ గోల!

496

Lavanya Tripathi: మనసుకి బాగా నచ్చిన పిల్ల అన్నా అనేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఛీ దీనెమ్మ జీవితం ఈ బతుకే వేస్ట్ అని అక్కడ నుండి ఎక్కడకైనా దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. అదే మన మన అభిమాన హీరోను ఒక హీరోయిన్ అంటే.. అప్పటి వరకు వదినా అనుకున్నది కాస్త అక్క అయిపోతే ఆ భావం మాటల్లో చెప్పలేనిది. సరిగ్గా ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో ఇదే జరిగింది. సందీప్ కిషన్ – లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మార్చి 5న రిలీజ్ కానుండగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు.

కాగా ఈ వేడుకలో మాట్లాడిన లావణ్య త్రిపాఠి.. ‘A1 ఎక్స్ ప్రెస్’ నా మనసుకు బాగా నచ్చిన సినిమా. ఈ కథను వినగానే చాలా కొత్తగా అనిపించి వెంటనే ఓకే చెప్పేశాను. ఈ సినిమా కోసం నేను ‘హాకీ’ నేర్చుకుని.. కోవిడ్ సమయంలో చాలా కష్టాలు పడి ఈ సినిమాను పూర్తి చేశామని సినిమా గురించి ఏదేదో చెప్పేసింది. ఇక హీరో సందీప్ గురించి మాట్లాడిన లావణ్య.. సందీప్ అన్న గురించి చెప్పాలంటే.. అంటూ నోరు జారింది. అంతే స్టేజ్ పై ఉన్న హీరో రామ్ తో సహా అంతా పెద్దగా నవ్వేశారు. వెంటనే తేరుకున్న లావణ్య ‘సారీ .. సారీ .. సారీ ఆయన మీకు అన్న .. నాకు ఫ్రెండ్’ అంటూ నవ్వుతూనే లావణ్య కవర్ చేసింది. కానీ ఫ్యాన్స్ అల్లరి మాత్రం చాలాసేపు ఆగలేదు.

కాగా ఈ సినిమాలో లావణ్యతో సందీప్ రొమాన్స్ సన్నివేశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ లోనే కనిపించింది. మరి అంతటి రొమాన్స్ చేసిన హీరోను పట్టుకొని అన్నా అని ఎలా అనేసిందబ్బా అని ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే రచ్చ మొదలైంది. ఇదే ఈవెంట్ లో మాట్లాడిన హీరో రామ్ అయితే లావణ్యపై సెటైర్లు వేశారు. గోదావరి జిల్లాలో పుట్టిన లావణ్య దగ్గర చాలా వెటకారం ఉందని.. తన గురించి నాకు బాగా తెలుసంటూ కాసేపు కామెడీ చేయడంతో నవ్వడం లావణ్య వంతైంది.