వీడేం మొగుడురా బాబు.. మంచినీరు అని భార్యతో యాసిడ్ తాగించాడు.

239

వీడేం మొగుడురా బాబు.. మంచినీరు అని భార్యతో యాసిడ్ తాగించాడు.

క్రూరత్వం పరాకాష్టకు చేరితే ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది. ఆడపిల్ల పుట్టిందని ఓ కసాయి భర్త, మంచి నీళ్లలో యాసిడ్ కలిపి భార్యతో తాగించాడు. ఈ దారుణ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. అపర్ణ అనే మహిళకు భర్త గంగునాయుడు యాసిడ్ కలిపిన నీరు ఇచ్చాడు. అయితే ఆమె తాగనని చెప్పినా బలవంతంగా తాగించాడు.దింతో ఆమె మంచాన పడింది.

కూతురు ఆరోగ్యం బాగాలేదని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బయట పడింది. దింతో అపర్ణ తల్లిదండ్రులు పెందుర్తి పోలీస్ స్టేషన్ లో అల్లుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.