లావణ్య లిప్ లాక్.. ఇక హద్దులు చెరిపేసినట్లే!

276

కాలం మారింది.. చేతులు కట్టుకొని కూర్చొంటే వెతుక్కుంటూ అవకాశాలు వచ్చే రోజులు పోయాయి. మడికట్టుకు కూర్చుంటే అసలుకే మోసం వస్తుంది. ఇది మన నటీమణులకు చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఛాన్స్ దొరికితే రెచ్చిపోయి కుర్రాళ్ళ హృదయాలలో తిష్ట వేసి కూర్చుంటున్నారు. అలాంటి వారికే దర్శక నిర్మాతలు అడ్వాన్సులు ఇస్తున్నారు. అందాల రాక్షసి సినిమాలో లావణ్య త్రిపాఠి మీకు గుర్తుందా.. గాయత్రీ మంత్రం చదువుతూ హీరో వెంటపడుతుంటే నాకు పెళ్లి చేసేయండి నానా అని అమాయకంగా అడిగే సీన్ కనిపిస్తుంది.

అలాంటి లావణ్య ఇప్పుడు లిప్ లాక్ సీన్లకు కూడా సై అంటుంది. అందాల రాక్షసి అనంతరం నానీ నుండి నాగార్జున వరకు చాలామందితో నటించినా పరిధి దాటి ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేసింది లేదు. కానీ ఇప్పుడు ఆ విషయంలో కూడా హద్దులు చెరిపేసింది. మొత్తంగా హాట్ బ్రాండ్ కోసం ట్రైల్స్ మొదలు పెట్టేసింది. యంగ్ హీరో సందీప్‌కిషన్ తో క‌లిసి ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించిన లావ‌ణ్య సందీప్ కు లిప్ లాక్ ఇచ్చేసిందా అనిపిస్తుంది. అంతేకాదు హీరో ఇంటెన్స్ సన్నివేశాలు కూడా దట్టించినట్లుగా కనిపిస్తుంది. వచ్చే నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సోయగం అందాలకు డిమాండ్ ఎంతన్నది అప్పుడే తెలియనుంది.

లావణ్య లిప్ లాక్.. ఇక హద్దులు చెరిపేసినట్లే!