రూ.5 కోట్లు కట్టాలని ఆటో డ్రైవరుకు ఆదాయపు పన్నుశాఖ నోటీసు!

328

రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు అంటారు కదా.. అచ్చం అలాంటి పరిస్థితే ఆ ఆటో డ్రైవరుది. అసలే కరోనా దెబ్బకు విధించిన లాక్ డౌన్ లో నానా యాతన అనుభవించి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ డ్రైవరుకు ఆదాయ పన్నుశాఖ నోటీసు ఇచ్చి౦ది. అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. అక్షరాల రూ.ఐదు కోట్ల రూపాయలు కట్టాలని నొటీసులు ఇవ్వడ౦తో అవాక్కవడ౦ ఆ డ్రైవర్ వంతయింది. ఈ విచిత్రమైన సంఘటన రాజస్థాన్‌లోని బాడ్మేర్​లో జరిగింది. అయితే తనకు ఏ పాపం తెలియదని.. తన ఆధార్​, పాన్​ కార్డులు ఉపయోగించి ఎవరో ఈ మోసానికి పాల్పడ్డారని బాధిత ఆటో డ్రైవర్​ లబోదిబోమన్నాడు. రాజస్థాన్‌ బాడ్మేర్‌లోని పనోరియా గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్​కు గజేదాన్ చరణ్​కు ఆదాయ పన్ను శాఖ ఈ భారీ షాక్ ఇచ్చింది. రూ.32.63 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిపినందుకు గాను.. రూ.4.89 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపింది. అయితే ఇది తనకు తెలియకుండానే ఎవరో తనను మోసం చేశారని డ్రైవర్ వాపోతున్నాడు.

రూ.5 కోట్లు కట్టాలని ఆటో డ్రైవరుకు ఆదాయపు పన్నుశాఖ నోటీసు!